ఘట్కేసర్‌‌‌‌–యాదగిరిగుట్ట MMTSప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి చేయాలి:ఎంపి చామల

ఘట్కేసర్‌‌‌‌–యాదగిరిగుట్ట MMTSప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి చేయాలి:ఎంపి చామల
  • ఎంపీ చామల కిరణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: ఘట్కేసర్‌‌‌‌ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ ను కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని ఎంపీ చామల కిరణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌‌‌‌ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీ-ఎస్‌‌‌‌ ప్రాజెక్టు ఎప్పటిలోపు పూర్తవుతుందని గురువారం లోక్ సభలో ప్రశ్నించారు. ఎంఎంటీ-ఎస్‌‌‌‌ ప్రాజెక్టుతో ఘట్కేసర్‌‌‌‌, యాదాద్రివాసులకు ఉద్యోగాలతో పాటు- ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు. 

కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన నిధులను మంజూరు చేసి త్వరతగతిన కంప్లీట్ చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి నిధులు భరిస్తామని కేంద్రానికి ఏమైనా హామీ ఇచ్చిందా..? అని అడిగారు. ఇందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు రూ. 279 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇంకా చెల్లించలేదని తెలిపారు. నిధులు 1:2 నిష్పత్తిలో రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందంతో 2016లో ఎంఎంటీ-ఎస్‌‌‌‌ ప్రాజెక్టు ప్రారంభించిందన్నారు. ఘట్కేసర్‌‌‌‌ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌‌‌‌ ప్రాజెక్టుకు 2016లో కేంద్రం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టు పెండింగ్‌‌‌‌లో ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.