హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన ఎక్స్‌లోనే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ, సన్న వడ్లకు రూ. 500 బోనస్, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి.. మెట్రో కారిడార్ పెంపునకు ప్లానింగ్, మూసీ పునరుజ్జీవం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క ఏడాదిలోనే ఎన్నో చేశామని చామల గుర్తుచేశారు.
‘‘మీలాగా రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి అందినకాడికి దండుకోలే. కమీషన్ల కాళేశ్వరాన్ని కూలిపోయేలా కట్టలే. ఈ ఫార్ములా రేసు స్కాం బట్టబయలు కాలే. లిక్కర్ స్కాంలు, ధరణి భూ దందాలు ..ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద అవినీతి చరిత్ర మీ కుటుంబ పాలనలో”అని చామల కౌంటర్ ఇచ్చారు.