
కేంద్రమంత్రి బండి సంజయ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఇండియా పాక్ మ్యాచ్ తో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి..పాక్ గెలవాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బండి సంజచయ్ రెచ్చ గొట్టే వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు ఎంపీ చామల. బండి సంజయ్ కరీంనగర్ కు వెళ్లగానే కేంద్రమంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి.. సడెన్ గా కార్పొరేటర్ గా మారిపోతరని సెటైర్ వేశారు .
Also Read :- దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించండి
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కాంగ్రెస్ ను పాకిస్తాన్ జట్టుతో పోల్చారు. బీజేపీ ఇండియా టీం..కాంగ్రెస్ పాకిస్తాన్ టీం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.