
- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇచ్చిన మాట నిలుపుకున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్రం నుంచి గెలుపొందిన బీజేపీ ఎంపీలదే అని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మీడియాకు ఎంపీ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.
దేశంలో ఇప్పటి వరకు జనగణన జరిగిందే తప్ప కులగణన నిర్వహించలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని సూచించారు.