ఇథనాల్ ఫ్యాక్టరీ డైరెక్టర్​ తలసాని శ్రీనివాస్​ కొడుకే

ఇథనాల్ ఫ్యాక్టరీ డైరెక్టర్​ తలసాని శ్రీనివాస్​ కొడుకే
  • బీఆర్​ఎస్​ హయాంలో ఇష్టమొచ్చినట్లు పర్మిషన్లు ఇచ్చిన్రు: ఎంపీ చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పాపం బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌దే అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా దిలావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో పీఎంకే డిస్టిలేషన్ అనే కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించిందని చెప్పారు. ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఫ్యాక్టరీ అనుమతి కోసం 2023 జనవరిలో కేంద్ర పర్యావరణ శాఖ లేఖ రాశారన్నారు.

ఈ కంపెనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారని చెప్పారు. సొంత పార్టీకి చెందిన వ్యక్తికి సంబంధించిన కంపెనీకి ఇష్టారీతిన అనుమతులిచ్చి.. ఇప్పుడు రైతులపై బీఆర్ఎస్ కపట ప్రేమ ప్రదర్శిస్తోందని ఫైర్ అయ్యారు. తమ తప్పులను కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రుద్ది బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ సోషల్ మీడియా ముఠా కేవలం ఇదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు.