మూసీ ప్రజలు మురికి కూపంలోనే బతకాల్నా? : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

మూసీ ప్రజలు మురికి కూపంలోనే బతకాల్నా? : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌, ఈటలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు : మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించే నాయకులను రోడ్లపై తిరగనీయమని, మూసీ పునరుజ్జీవం కోసం ఉద్యమిస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో  మాట్లాడారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, మూసీ ప్రక్షాళన అవసరం లేదంటే, ఆయన అక్కడే ఉండి మూసీ నీళ్లతో స్నానం చేయాలన్నారు. వాసన రాకుంటే మూసీ ప్రక్షాళన అవసరం లేదన్నారు.

బీజేపీలో చేరి ఈటల కలుషితం అయ్యారని, ఆయన ఇంకా కేసీఆర్, కేటీఆర్‌‌‌‌నే అనుసరిస్తున్నారని విమర్శించారు. హరీశ్‌‌, కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేటీఆర్.. మీ నాయనలా సీఎం రేవంత్ రెడ్డి హౌలా మాటలు మాట్లాడరు.

హైదరాబాద్‌‌ను ఇస్తాంబుల్ చేస్తానని మీ నాయన మాట్లాడిన హౌలా మాటలను గుర్తు చేసుకో. పదేండ్ల పాలనకు, పది నెలల పాలనకు మధ్య యుద్ధం జరుగుతున్నది. మీ హయాంలో మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదు”అని కేటీఆర్‌‌‌‌ను ప్రశ్నించారు. పేదలు మురికి కూపంలోనే బతకాలా.. వారికి మంచి జీవితం ఇవ్వొద్దా అని నిలదీశారు 

చెరువులను మింగింది కల్వకుంట్ల కుటుంబమే: సామా రాంమోహన్ రెడ్డి

రాష్ట్రంలోని చెరువులు, నదులు, గనులు, భూములను మింగింది కల్వకుంట్ల కుటుంబమేనని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రాంమోహన్ రెడ్డి ఆరోపించారు.  అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇసుక లారీలతో తొక్కించి చంపిన నీచ చరిత్ర ఈ కుటుంబానిదని మండిపడ్డారు.