అల్లు అర్జున్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రియల్ లైఫ్ లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నట్లే ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరో రాసిన నోట్ ను... అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చదివారన్న ఎంపీ చామల...అసెంబ్లీలో సీఎం వాస్తవాలే చెప్పారన్నారు. పుష్ప2 సినిమాకు కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ అండగా ఉండి రేట్లు పెంచారని గుర్తు చేశారు ఎంపీ చామల.
పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ థియేటర్ లో ఎంత సేపు ఉన్నాడో... సీసీ ఫుటేజీ ఉందన్నారు MLC బల్మూరి వెంకట్. ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ను అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర టపాసులు కాల్చారని ఆరోపించారు బల్మూరి. అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
Also Read :- అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా తను రోడ్ షో చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది రోడ్ షో కాదని అల్లు అర్జున్ అన్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ కు దగ్గర్లో కారు ఆగిపోయిందని.. తన కోసం వచ్చిన అందరి కోసం ఒక గెస్చర్ ఇచ్చానని తెలిపారు. అంతమంది వచ్చినపుడు నేను లోపల దాక్కుంటే వాళ్లకు నేను ఏమిచ్చినట్లు.. అందుకోసమే తాను బయటికొచ్చి చేతులు ఊపుతూ ముంందుకు వెళ్లినట్లు చెప్పారు... ప్యాన్స్ కు తాను చెబితేనే వెళ్తారని పోలీసులు కూడా చెప్పడంతో బయటకి రావడం జరిగిందన్నారు. బాధ్యతగా అందరినీ ముందుకు వెళ్లాలని పోలీసులు చెప్పినట్లు తెలిపారు.