పలు స్టేషన్లలో ట్రైన్​లను ఆపాలని కేంద్రమంత్రికి వినతి

పలు స్టేషన్లలో ట్రైన్​లను ఆపాలని కేంద్రమంత్రికి వినతి

జనగామ, వెలుగు : భువనగిరి పార్లమెంట్​పరిధిలోని పలు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ట్రైన్​ల హాల్టింగ్  ఇవ్వాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి శనివారం కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ, కమ్యూనికేషన్​ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ను కలిసి వినతి పత్రం అందించారు. కేంద్ర మంత్రి హైదరాబాద్​కు వచ్చిన సందర్భంగా ఆయనను మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎంపీలు చామల కిరణ్​కుమార్​ రెడ్డి, కడియం కావ్యలు కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ కిరణ్​కుమార్​ రెడ్డి పార్లమెంట్​పరిధిలోని స్టేషన్​లలో ట్రైన్​ల హాల్టింగ్ లు సరిగా లేక ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై వినతి పత్రం అందించారు. 

భువనగిరిలో పద్మావతి ఎక్స్​ప్రెస్​కు హాల్టింగ్​ కల్పించాలన్నారు. మచిలీపట్నం ట్రైన్​ కూడా ఆగడం లేదన్నారు. కాకతీయ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య నడిచేదని, దీని సమయం మార్చి ఉదయం 4 గంటలకే వస్తోందన్నారు. యథావిధిగా గతంలోని టైంకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సికింద్రాబాద్–వరంగల్​ రూట్లో నాలుగు సార్లు నడిచే పుష్పుల్​ ట్రైన్​ కూడా ఉదయం, సాయంత్రం మాత్రమే నడుస్తోందని, నాలుగు సార్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.