చేర్యాల రెవెన్యూ డివిజన్​ ఏర్పాటుకు సహకరిస్తా : ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి

చేర్యాల రెవెన్యూ డివిజన్​ ఏర్పాటుకు సహకరిస్తా : ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి

చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్​ ఏర్పాటుకు సహకరిస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన చేర్యాలకు వచ్చిన సందర్భంగా రెవెన్యూ డివిజన్​జేఏసీ నాయకులువినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్​హయాంలో చేర్యాల ప్రాంతాన్ని సగం జనగామ జిల్లాలో సగం సిద్దిపటే జిల్లాలో కలిపి ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  అందుకే చేర్యాల అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

స్పందించిన ఎంపీ మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత తనదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నర్సింగరావు, అశోక్​, బీరయ్య, ప్రసాద్​, సత్యనారాయణ, ఇసాక్​, చంద్రం, లక్ష్మీనారాయణ, బాలరాజు, భిక్షపతి, శ్రీనివాస్​, మహేందర్, భూమయ్య, బాల్​రెడ్డి, జహీరుద్దీన్​, బాల్​రెడ్డి, శ్రీనివాస్​, నాని బాబు, ఎండీ. ఖాజా పాల్గొన్నారు. 

 తపాస్​పల్లి రిజర్వాయర్​ను నింపాలి: ఎమ్మెల్యే పల్లా

తపాస్​పల్లి రిజర్వాయర్​ ద్వారా చెరువులను, కుంటలను నింపేందుకు సహకరించాలని ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డిని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి కోరారు. డివిజన్​పరిధిలోని గొలుసుకట్టు చెరువులు, కుంటలు అడుగంటడంతో పొలాలు ఎండిపోతున్నాయని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. తపాస్​పల్లి రిజర్వాయర్​ డెడ్​ స్టోరేజీకి చేరిందని నింపేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. 

 కొమ్మూరిని పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే

జనగామ డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్​చార్జి, కొమ్మూరి ప్రతాపరెడ్డిని ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరామర్శించారు. కొమ్మూరి తల్లి సత్తమ్మ ఫొటో వద్ద నివాళులర్పించారు. వారి వెంట సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్​రెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, కొమ్ము రవి ఉన్నారు.