మంత్రి ఉత్తమ్ ను కలిసిన ఎంపీ చామల

మంత్రి ఉత్తమ్ ను కలిసిన ఎంపీ చామల
  • చేర్యాల ప్రాంత రైతుల నీటి కష్టాలు తీర్చాలని వినతి

చేర్యాల, వెలుగు: చేర్యాల ప్రాంత రైతుల నీటి కష్టాలు తీర్చాలని కోరుతూ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుధవారం కలిశారు. హైదరాబాద్​లోని మంత్రి చాంబర్​లో కలిసి రంగనాయకసాగర్ డీ-10 కెనాల్ నుంచి కమాలాయపల్లి, అర్జునపట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలకు సాగునీరు అందించాలని కోరారు.  

గండిరామవరం రిజర్వాయర్ ద్వారా బయ్యన్న చెరువు నుంచి కొండాపూర్ గ్రామానికి సాగునీరు అందించాలని, చేర్యాల పెద్దచెరువునింపాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి  సిద్దిపేట, వరంగల్ సీఈలు హరిరాం, శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి  సాగునీరు విడుదల చేయాలని ఆదేశించించారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ రెడ్డి, నర్సింగరావు, కమలాకర్ యాదవ్, కుమార్, నర్సింలు, జగ్గారెడ్డి, నాగరాజం, చోటేమియా, బాబు, యాదగిరి, నర్సింహులు, కనకయ్యా, ఐలయ్య, శ్రీనివాస్, అర్జునపట్ల, కమలాయపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.