సీఎం రేవంత్ అమెరికా టూర్.. తెలంగాణకు రూ.31,500 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్ : సీఎం రేవంత్  రెడ్డి అమెరికా పర్యటనతో రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.31,500 కోట్లు ఐటీ, ఫార్మా, ఏఐ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్లో మీడియాతో ఎంపీ మాట్లాడారు.. సీఎం పర్యటనను కొంతమంది ఓర్వలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హాయంలో పడేండ్ల సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ కమిటీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.

రాష్ట్రానికి పచ్చే కొత్త కంపెనీలతో పాటు, ఇక్కడ ఉండే కంపెనీలకు ప్రభుత్వ అన్ని రకాల సపోర్ట్ ఉంటుందన్నారు. కేటీఆర్ బంధువులైన తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తే స్వాగతిస్తామన్నారు. విదేశీ కంపెనీల్లో వర్క్ చేయడానికి ఇక్కడి యువతకుప్రదేశ్ శిక్షణ ఇప్పిస్తామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకో వడంలో బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేయాల న్నారు. సుంకిశాల విషయంలో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ చేస్తున్న ఆసత్య ప్రచారా లను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నా రు. బీఆర్ఎస్ తప్పదం వల్ల సుంకిశాల కూలిందన్నారు.