యాదాద్రి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా ఎన్నికైన భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి బుధవారం కలిశారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకూ జరిగిన పరిణామాలను వివరించారు. అనంతరం ఇచ్చిన మాట ప్రకారం భువనగిరి ఎంపీ సీటును గెలిపించుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితోపాటు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామెల్, కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాపరెడ్డిని సీఎం అభినందించారు.
అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వద్దకు చామల వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.