
నిజామాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌పై కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్‌పై కవిత వాఖ్యలు అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
నేను కూడా పవన్ కల్యాణ్ అభిమానినేనని.. ఆయన కెరీర్‌ని త్యాగం చేసి ప్రజా సేవలోకి వచ్చారని కొనియాడారు. అధికారం కోల్పోయినా కేటీఆర్, కవితకు అహంకారం ఇంకా తగ్గలేదని దుయ్యబట్టారు. మేము జాతీయ వాదాన్ని మోస్తామని.. కవిత లాగా లిక్కర్ స్కామ్ సంచులు మొయ్యమని ఎద్దేవా చేశారు.
ఇక, కాంగ్రెస్ పార్టీపైన అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ చావుకు కారణం కాంగ్రెస్ పార్టీనేని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. అంబేద్కర్‌ను రాజకీయంగా, మానసికంగా హింసించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కానీ బీజేపీ అంబేద్కర్ ను ఎంతో గౌరవించిందని.. ఆయనకు భారతరత్న ఇవ్వటంతో పాటు అంబేద్కర్ జీవిత చరిత్రను పంచతీర్థ గా అభివృద్ధి చేసింది బీజేపీనేనని పేర్కొన్నారు.