బాల్కొండ, వెలుగు: అక్రమ తవ్వకాల ద్వారా బట్టాపూర్ క్వారీలో రూ.250 కోట్ల దోపిడీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్పడ్డారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బుధవారం మెండోరా మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే పక్కదారి మళ్లించి, రోడ్లు, భవనాల శాఖలో అదనపు బిల్లులు కాజేశారని మండిపడ్డారు. కాంగ్రెస్అభ్యర్థి సునీల్ కుమార్ రంగులు మార్చినంత ఈజీ గా పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు.
బాల్కొండలో మొదటిసారిగా బీజేపీ మహిళా అభ్యర్థిగా అన్నపూర్ణమ్మకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, మల్కన్నగారి మోహన్, నిమ్మల శ్రీనివాస్, నడిపి సాయన్న, గంగారెడ్డి, సాయిరెడ్డి, ముత్యం, రమేశ్, రాజు తదితరు పాల్గొన్నారు.