కవిత అరెస్ట్‪పై ఎంపీ అరవింద్ రియాక్షన్ ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్తున్న విషయం తెలిసిందే.. అయితే కవిత అరెస్ట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కవిత అరెస్ట్ తో బీజేపీ సంబంధం లేదని మీడియాతో అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అర్వింద్ తేల్చి చెప్పారు. ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ కావాలనే బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ తన పని తాను చేస్తుందని అర్వింద్ అన్నారు. కవిత అరెస్ట్ ని రాజకీయాలకు ముడిపెట్టడం బీఆర్ఎస్  దివాలా కోరు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.