ఎమ్మెల్సీ కవిత ఎక్కడ పోటీ చేసినా ఆమెకు ఓటమి తప్పదు : అర్వింద్

నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లోని 7 స్థానాలను కైవసం చేసుకుంటామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ హేమా హేమీలకు ఓటమి తప్పదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీ కవిత.. తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత ఎక్కడ పోటీ చేసినా ఆమెకు ఓటమి తప్పదన్నారు. గజ్వేల్​లో సీఎం కేసీఆర్ ఓడిపోతారని చెప్పారు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్, కవితే కారణమని ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు సగం మంది ఆ పార్టీలో ఉండరని చెప్పారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్​కేసులో ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ కొనసాగుతోందన్నారు. కోరుట్లలో పద్మశాలి బంద్​కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కోరుట్లలో 20 శాతం పైగా ఓట్ల మెజారిటీతో తాను గెలుస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ కార్యకర్తలే ఓడించారని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందన్నారు. ఉత్తర తెలంగాణలో స్వీప్ చేస్తామని చెప్పారు. బీజేపీతోనే వ్యవసాయ సంస్కరణలు సాధ్యమన్నారు. 

ALSO READ :- న్యాయం చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేస్తాం: శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్