పదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది : ఎంపీ ధర్మపురి అర్వింద్

పదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది : ఎంపీ ధర్మపురి అర్వింద్

మెట్ పల్లి, వెలుగు :  గతంలో ముస్లిం దేశాల్లోని హిందువులు బొట్టు పెట్టుకుంటేనే దాడులు చేసేవారని.. ఇప్పుడు ఆ దేశాల్లో హిందూ ఆలయాలు కడుతున్నారని, అందుకు ప్రధాని మోదీనే కారణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి మండలం బండలింగపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవతలను అవహేళన చేసిన దుబాయిలో హిందూ దేవాలయాలు కట్టుకునే స్థాయికి వచ్చామన్నారు.

తెలంగాణను పదేళ్లు పాలించిన మాజీ సీఎం అబద్ధపు హామీలతో మోసం చేస్తే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో  కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోరేపల్లి సత్యనారాయణ, కొమ్ముల రాజ్‌‌పల్ రెడ్డి, నీలి గంగాధర్ పాల్గొన్నారు.