రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం : ఎంపీ ధర్మపురి అర్వింద్

ఆర్మూర్, వెలుగు : బీజేపీ కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకెళ్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్ ప్రోగ్రాం జరిగింది.  చీఫ్​ గెస్ట్​గా హాజరైన ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఆర్మూర్ అసెంబ్లీలోనే కాదని, తెలంగాణలో కూడా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే నమ్మకం ఈ ప్రొగ్రాంతో బలపడిందన్నారు. 

ALSO READ :మరో మండల్​ ఉద్యమం కావాలి : ప్రొ. ఎస్. సింహాద్రి

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇన్​చార్జి అల్జాపూర్ శ్రీనివాస్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, నాయకులు జీవీ నరసింహారెడ్డి, ఆలూరు విజయభారతి రెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, కంచెట్టి గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్​ పాల్గొన్నారు.