ఎన్ని సీట్లు వచ్చినా అధికారం చేపడుతాం : ఎంపీ ధర్మపురి అర్వింద్​

బోధన్​, వెలుగు: తెలంగాణలో బీజేపీకి  ఎన్నిసీట్లు వచ్చినా తామే అధికారం చేపడుతామని  ఎంపీ  ధర్మపురి అర్వింద్​ దీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ హైకమాండ్​తో టచ్​లో ఉన్నారని తెలిపారు. మంగళవారం బోధన్​లో యువశక్తి విజయ సంకల్పసభ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ మాట్లడుతూ బోధన్​లో బీజేపీ  గెలుస్తే నిజాంషుగర్​ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిసెంబర్​ 3 తర్వాత ఫ్యాక్టరీ  భూములను కేసీఆర్​ కంటే స్పీడ్​గా అమ్ముతారన్నారు. కవిత, రేవంత్​ఇప్పటికే కలిసి బిజినెస్ ​చేస్తున్నారని గుర్తు చేశారు.  బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్​రెడ్డి స్థానికంగా ఉంటారన్నారు.

అధికారంలోకి రాగానే  నిజామాబాద్​లో 500 పడకలతో సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్​ నాయకులకు అహంకారం, మదం  ఎక్కువగా ఉందన్నారు. బోధన్​లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్​ రెడ్డి అన్నారు. బోధన్​లో షకీల్​ను ఓడించి కమలం పువ్వు గెలుస్తుందన్నారు.  కార్యక్రమంలో  మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డూరి శ్రీనివాస్, నర్సింహరెడ్డి, సుధాకర్​చారి,  నాయకులు , యువకులు, తదితరులు  పాల్గొన్నారు.  

ALSO READ : పండుగ సీజన్ ముగిసింది.. భారీగా పెరిగిన బంగారం ధర