
- ఏ పదవి అప్పగించినా పనిచేస్త
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయనని, పార్టీ ఏ పదవి అప్పగించినా పనిచేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ గ్రామస్థాయిలో ప్రతి ఇంటికీ చేరిందని, అందుకే ఎనిమిది సీట్లు గెలిచామని అన్నారు. ఎలక్షన్స్ పూర్తయ్యాయని, ఇక నియోజకవర్గాల అభివృద్ధిపై ఎంపీలం దృష్టి పెడతామని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరమని ఆమె అన్నారు.
బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో డీకే అరుణ చిట్ చాట్ చేశారు. సీఎం రేవంత్, డీకే అరుణ ఒకే ఫ్లైట్ లో వెళ్లినంత మాత్రానా కలిసినట్టు కాదని ఆమె వ్యాఖ్యానించారు. పాలమూరు లిఫ్ట్ కోసం కొత్తగా డీపీఆర్ రెడీ చేయాలని సీఎంను ఆమె కోరారు. పాలమూరు రంగారెడ్డిలో రంగారెడ్డిని తీసేసి పాలమూరు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వర్క్స్ పూర్తి చేస్తే వలసలు ఆగిపోతాయని ఆమె అన్నారు. డిండికి పాలమూరు నుంచి నీళ్లు తీసుకోవద్దని ఆమె కోరారు. శుక్రవారం ఎంపీలమంతా ఢిల్లీ వెళ్తున్నామని, శనివారం ప్రమాణస్వీకారం చేస్తామని అరుణ వెల్లడించారు.