
- ఉదండాపూర్ రిజర్వాయర్
- భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు
జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లాలోని ఉదండాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పరిహారం కోసం జడ్చర్ల మండలం ఉదండాపూర్లో నిర్వాసితులు ఆందోళన చేస్తుండగా ఆదివారం శిబిరాన్ని ఎంపీ సందర్శించి.. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. బాధిత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉదండాపూర్ రైతుల డిమాండ్లు న్యాయమైనవని, నిర్వాసితులకు పరిహారం వన్ టైం సెటిల్మెంట్చేశాకే పనులు ప్రారంభించాలని స్పష్టంచేశారు. పదేండ్ల నాటి లెక్కల ప్రకారమే ఇస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పార్టీల వారీగా పరిహారం ఇస్తామనడం సరికాదని, ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి చొరవ తీసుకొని సీఎం వద్దకు రైతులను తీసుకెళ్లి న్యాయం చేయాలని ఎంపీ సూచించారు.