సీఎం అన్నను పంపిస్తరు.. నన్ను అడ్డుకుంటరా: MP డీకే అరుణ ఫైర్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి వల్లే  లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని, ముందుగా ఆయనను అరెస్టు చేయాలని మహబూబ్  నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని, తాను అపాయింట్ మెంట్ తీసుకొని వచ్చానని చెప్పారు. సీఎం అన్న తిరుపతి రెడ్డిని పంపించి తనకు అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందన్నారు. సీఎం సొంత జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందని విమర్శించారు. డీకే అరుణను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా.. తాను రానని చెప్పారు. తానేం తప్పు చేయలేదని అన్నారు.