హైడ్రా పేరుతో హైడ్రామా.. ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్

హైడ్రా పేరుతో హైడ్రామా.. ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 27) మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ డ్రామా చేస్తోందని విమర్శించారు. పాలన చేతకాక హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మరల్చుతోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్‎ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసింది. 

ALSO READ | GHMC కీలక నిర్ణయం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు బ్యాన్

గవర్నమెంట్ నుండి ఫ్రీ హ్యాండ్ ఉండటంతో గ్రౌండ్‎లో హైడ్రా హైస్పీడ్‎తో దూసుకెళ్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అక్రమ కట్టడమైతే చాలు నేటమట్టం చేస్తోంది. అయితే, హైడ్రాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు హైడ్రాను సమర్థిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పేదల కట్టడాల విషయంలో హైడ్రా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుట్టుంది. పేదలకు ప్రత్నామ్నాయం చూపించిన తర్వాత వాళ్ల నిర్మాణాలను కూల్చివేయాలని.. అలా కాకుండా ఉన్నఫలంగా ఇళ్లను కూల్చివేస్తే వారు రోడ్డున పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.