బీజేపీ పై ప్రజల్లో  నమ్మకం పెరుగుతుంది : ఎంపీ డీకే అరుణ

బీజేపీ పై ప్రజల్లో  నమ్మకం పెరుగుతుంది : ఎంపీ డీకే అరుణ

గద్వాల, వెలుగు: బీజేపీ పార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గద్వాలలోని ఆమె నివాసంలో శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన వాసిరెడ్డి బీజేపీ లో చేరగా ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్   ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు.

హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు  పార్టీపై నమ్మకం కోల్పోతున్నారన్నారు. భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి తిరుపతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోకారి, బలరాముడు తదితరులు ఉన్నారు.