మహిళా శక్తి కోసం పెద్దపల్లికి రూ. 20 కోట్లు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మహిళా శక్తి కోసం పెద్దపల్లికి రూ. 20 కోట్లు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ మహిళలను పట్టించుకోలేదన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.  మహిళా శక్తి కోసం  పెద్దపల్లికి రూ. 20 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవ్ లప్ మెంట్ ను ప్రోత్సహిస్తుందన్నారు.  

నవంబర్ 25 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలతో హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇంటరాక్టివ్ మీటింగ్ నిర్వహించింది సీఐఐ. ఈ సమావేశానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వేశ్వర్ రెడ్డి. .కేంద్ర ప్రభుత్వ నిధులను తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు . రంగారెడ్డి నుంచే 20 శాతం రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందన్నారు.