విద్యార్థుల్లో టెక్నికల్ స్కిల్స్ పెంచండి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

విద్యార్థుల్లో టెక్నికల్ స్కిల్స్ పెంచండి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • గ్రామీణ విద్యార్థులను అన్ని విధాలుగా సపోర్టు చేస్త 
  • టెక్నాలజీ, స్కిలెవలప్మెంట్పై దృష్టి పెట్టండి 

పెద్దపల్లి: విద్యార్థుల్లో టెక్నికల్ స్కిల్స్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దప ల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా 150 ఫైబర్ కుర్చీలను కాలేజీకి అందజే శారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడా రు.. విద్యార్థుల్లో టెక్నాలజీ మీద ఆసక్తి పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. తాను కూడా చదువుకునే రోజుల్లోనే టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంటు మీద ఆసక్తితో ఎలక్ట్రికల్ బైకును తయారు చేశానన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ కు వచ్చి చదువుతున్న విద్యార్థులు ఇన్నోవేటివ్ స్పిరిట్ ఉన్నట్లయితే వారికి తన వంతు సహకరి స్తానన్నారు.

తమ కుటుంబ ఆద్వర్యంలో అంబే డ్కర్ కాలేజీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా 25 శాతం విద్యార్థులకు ఫ్రీగా ఎడ్యుకే షన్ ఇస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్త ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా రామగుండంలో సమస్యలపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇక్కడి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు." సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నాన న్నారు. 

ఐటీఐ సిబ్బంది కాలేజీలో ఉన్న సమస్యల ను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపైస్పం దించిన ఎంపీ విశాఖ ట్రస్టు ద్వారా లేదా ఎంపీ నిధుల నుంచి కాలేజీలో మౌలికసదుపాయాలు కల్పిస్తాని హామీ ఇచ్చారు.. అనంతం విద్యార్థుల తో కలిసి క్రికెట్ ఆడారు. సుల్తానాబాద్ లో గత ఏడాది మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సంవత్సరికం జరుగనున్న సందర్భంగా వారికుటుంబ సభ్యులను పరామర్శించారు.