
న్యూఢిల్లీ, వెలుగు: మంచిర్యాల, ధర్మపురి ప్రాంతాల్లో కొత్తగా ఎకో పార్కులను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా? అని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, సంబంధిత శాఖ మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో కొత్తగా ఎకో పార్కులు, బయో డైవర్సిటీ జోన్స్ ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ జూ అథారిటీకి ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు.