చిన్న పట్టణాలకు పరిశ్రమలు రావాలి:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

చిన్న పట్టణాలకు పరిశ్రమలు రావాలి:ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • యువతలో స్కిల్స్​​ను ​పెంచాలి
  • సీఐఐ మీటింగ్​లో ఎంపీ వంశీకృష్ణ

హైదరాబాద్​, వెలుగు: ప్రపంచంలోనే అత్యధిక యువ శ్రామిక జనాభా మనదేశంలో ఉందని, అయితే చిన్న పట్టణాల్లోని యూత్​కు తగిన ఉద్యోగాలు దొరకడం లేదని పెద్దపల్లి ఎంపీ, పారిశ్రామివేత్త గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి పరిశ్రమలను చిన్న నగరాలకు తీసుకురావాలన్నారు. లేకపోతే నిరుద్యోగం పెరుగుతుందని ఆయన చెప్పారు.

  సీఐఐ హైదరాబాద్​లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తన సొంత నియోజకవర్గం పెద్దపల్లే ఇందుకు ఉదాహరణ అని, ఎంతో చదువుకున్న లోకల్​ యూత్​ ఆటో డ్రైవర్ల వంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. 

‘‘యువతకు ఉద్యోగాలను కల్పించడానికి సీఐఐతో కలిసి పనిచేస్తాం. ఈ విషయంలో తమిళనాడు మనకు స్ఫూర్తిదాయకం కావాలి. యువతలో నైపుణ్యం పెంపుదలకు ఆ రాష్ట్రం చాలా చేసింది. అక్కడి ఆటో నిపు ణులు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు.  

మనమూ అలాంటి ట్యాలెంట్​ను తయారు చేసుకోవాలి.  మనం ఎంతగా భారీ పెట్టుబడులు పెట్టినా తగిన ట్యాలెంట్​ దొరకకుంటే వేస్ట్.​ నైపుణ్యం పెంచడానికి సీఐఐ చేస్తున్న ప్రయత్నాలకు నా వంతు సహకారం ఉంటుంది. 

నేను ‘ఇన్వెస్ట్​ ఇన్ ​పెద్దపల్లి’ అనే కార్యక్రమం కూడా చేపట్టాను. మా దగ్గర బొగ్గు, సిరామిక్​ సహా చాలా సహజవనరులు ఉన్నాయి.  వీటితో ఎన్నో పరిశ్రమలు పెట్టవచ్చు”అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి,  సీఐఐ తెలంగాణ పబ్లిక్​ పాలసీ టాస్క్​ఫోర్స్​ చైర్మన్​ శేఖర్​ రెడ్డి, మాజీ చైర్మన్​ రాజు కిర్బీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు