
పెద్దపల్లి: జిల్లాలోని పాలకుర్తి మండలం కన్నాలలో రైల్వే అండర్ వే బ్రిడ్జి ఏర్పాటుకు కృష్ణి చేస్తానన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంగళవారం (ఏప్రిల్ 22) కన్నాల గ్రామ బొడ్రాయి విగ్రహప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వంశీకృష్ణకు గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు.
అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉంటానన్నారు. గ్రామంలో రైల్వే అండర్ వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎంపీ వంశీకృష్ణను గ్రామ ప్రజలు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీ.. రైల్వే అండర్ వే బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.