పెద్దపల్లి అభివృద్ధికి కృషి చేస్త : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి అభివృద్ధికి కృషి చేస్త : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • బెల్లంపల్లిలో ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ రైళ్ల హాల్టింగ్‌‌‌‌ సమస్యను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్త : గడ్డం వంశీకృష్ణ
  • మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించిన ఎంపీ

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌/బెల్లంపల్లి, వెలుగు : పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు వివిధ సమస్యలపై ఎంపీకి వినతిపత్రాలు అందజేశారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌లో దక్షిణ్, నవజీవన్, కేరళ సూపర్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ రైళ్లకు హాల్టింగ్‌‌‌‌ కల్పించాలని.. బెల్లంపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు, ఉదయం 8 గంటల తర్వాత సికింద్రాబాద్​వెళ్లేందుకు మరో రైలును నడిపించాలని స్థానికులు ఎంపీకి విన్నవించారు.

రైల్వే స్టేషన్‌‌‌‌లో దివ్యాంగులు, వృద్దులు, మహిళల సౌకర్యార్థం ఎస్కలేటర్ లిప్ట్, రాంనగర్ అండర్ బ్రిడ్జి ప్రారంభించేలా కృషి చేయాలని కోరారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే రైల్వే జీఎంను కలిసి బెల్లంపల్లిలో ఎక్స్​ప్రెస్ రైళ్ల హాల్టింగ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి-చంద్రాపూర్ నేషనల్ హైవేలోని కన్నాల వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలు చేపట్టేలా కాంట్రాక్టర్​ను ఆదేశించారు. మంచిర్యాలలోని లేబర్ బస్తీలోని పంచముఖ హనుమాన్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన వంశీకృష్ణ పలు బాధిత కుటుంబాలను కలిశారు. ఇటీవల బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో ఇడిగిరాల భీమయ్య ఇల్లు కాలిపోయింది. వంశీకృష్ణ ఆ ఇంటిని పరిశీలించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నస్పూర్ మండలం ఆర్కే6 కొత్త రోడ్ రాజీవ్​నగర్​కు చెందిన ఐఎన్టీయూసీ లీడర్ బొడ్డు ప్రభాకర్ కూమారుడు వెంకట శ్రీరామకృష్ణ కొద్దిరోజుల కిందట ప్రమాదానికి గురికాగా ఎంపీ పరామర్శించారు.

మంచిర్యాలలోని లేబర్ బస్తీలో ఉన్న పంచముఖ హనుమాన్ దేవాలయంలో పూజలు చేశారు. మంచిర్యాలకు చెందిన మిట్ట శంకర్​-లక్ష్మి దంపతుల కూతురు హిమబిందు వివాహం ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఆమెను ఆశీర్వాదించారు. బెల్లంపల్లిలో యూత్ కాంగ్రెస్ లీడర్ లెంకల శ్రవణ్ కుమార్ బర్త్​డే వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు.

అంతకుముందు మంచిర్యాల హైటెక్ సిటీ కాలనీలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో ఎంపీ వంశీకృష్ణను ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, వివిధ కుల సంఘాల లీడర్లు, కార్యకర్తలు కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఎంపీ వెంట టీపీసీసీ జనరల్ సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్​రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు సుదమల్ల హరికృష్ణ, బండి సదానందం యాదవ్, నల్ల రవి, మునిమంద రమేశ్, భూపెల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.