న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా మోడీ సర్కార్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ కృష్ణ స్పందించారు.
కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నా లాభం లేదని విమర్శించారు. బడ్జెట్లో కేవలం రెండు, మూడు రాష్ట్రాలకే పెద్ద పీట వేశారని.. ఇది కేవలం ఓట్ బ్యాంక్ బడ్జెట్ అని అభివర్ణించారు ఎంపీ వంశీకృష్ణ. కేవలం అంబానీ, అదానీకే ఇన్సెంటివ్‌లు ఇస్తున్నారని.. అలా కాకుండా ఉద్యోగాలు కల్పించే వారికే ఇన్సెంటీవ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ALSO READ | Union Budget 2025: బడ్జెట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్
పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన.. కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడినా లాభం లేకుండాపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఏడాదికి 2 ఉద్యోగాల హామీ ఏమైందని బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో దేశంలో గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందన్నారు.