ఢిల్లీలో ఆటమ్​ బైక్స్ ఔట్​లెట్ ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఢిల్లీలో ఆటమ్​ బైక్స్ ఔట్​లెట్ ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • అందుబాటులోకి 3 ఈవీ మోడల్స్​
  • రూ.40 వేల వరకు డిస్కౌంట్లు  

న్యూఢిల్లీ, వెలుగు:  సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్స్ తో ఎలక్ట్రిక్​ బైకులు తయారు చేసే ‘ఆటమ్​ మొబైల్’  ఢిల్లీ ద్వారక సెక్టార్ 5 లోని రాజాపురిలో తన మొదటి ఔట్ లెట్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం దీనిని ఆటమ్​ మొబైల్ సంస్థ జేఎండీ, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్‌‌ బైక్స్ అమ్మకాల్లో ఆటమ్​ మొబైల్స్‌‌ను అగ్రగామిగా నిలపాలని, ఇతర కంపెనీలతో పోటీ పడి ఉన్నత శిఖరాలకు చేర్చాలని   ఉద్యోగులకు సూచించారు. ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం గురించి వివరించారు.   ఫస్ట్ ఔట్ లెట్ లాంచ్ సందర్భంగా కంపెనీ మూడు ఎలక్ర్టిక్​ బైక్​ మోడల్స్​పై దాదాపు రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకు డిస్కౌంట్లను  ప్రకటించింది. 

ఆటమ్​ వేడర్–ఎస్ మామూలు ధర రూ. 1,08,500 కాగా... దాదాపు రూ. 25 వేల డిస్కౌంట్ ఆఫర్ లో రూ. 84, 999 కు అందిస్తోంది.   వేడర్​– ఈ, ఎక్స్ డిజైన్ల ధర రూ. 1, 38,000 కాగా, కేవలం రూ. 99,999 కు అమ్మతోంది.  వీటిని ఒకసారి ఛార్జ్ చేస్తే... 100 కిలోమీటర్లు వెళ్తాయి.  డిజైన్, చార్జింగ్, సీటింగ్, డ్రైవింగ్, మన్నికలో ఇవి ప్రత్యేకమని కంపెనీ పాన్​ ఇండియా సేల్స్ హెడ్ అజిత్ సాబ్డే తెలిపారు. కేవలం మూడున్నర గంటల్లో చార్జ్​ చేయవచ్చని , గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని చెప్పారు. ఏరియా మేనేజర్ కునాల్ భరద్వాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న డిజైన్ల కన్నా ఈ బైక్ మోడల్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు.