
- కాజీపేట-బల్లార్షాఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ, మందమర్రిలో హాల్టింగ్‌కు కృషి పట్ల కృతజ్ఞతలు
కోల్ బెల్ట్, వెలుగు: కాజీపేట–-బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణకు, మందమర్రి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించేందుకు కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోకు గురువారం మందమర్రి మార్కెట్లో యూత్ కాంగ్రెస్ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు.
యూత్‌కాంగ్రెస్ లీడర్ రాయబారపు కిరణ్ మాట్లాడుతూ నాలుగేండ్లు క్రితం కరోనా సమయంలో కాజీపేట–బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దయ్యిందని.. రైలు సౌకర్యం లేక ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో విషయాన్ని ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకవెళ్లి రైలు పునరుద్ధరణకు కృషి చేశారన్నారు.
రైలు పునరుద్ధరణతో పాటు మందమర్రి రైల్వేస్టేషన్లో రైలుకు హాల్టింగ్ కల్పించిన ఎంపీ, ఎమ్మెల్యేకు లీడర్లు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. లీడర్లు బియ్యపు రవి కిరణ్, సురేందర్, లక్ష్మణ్, ధనుక్ రాజేశ్, గణేశ్, మహేశ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.