పెద్దపల్లి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పర్యటించారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయినవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను బాధితులకు అందజేశారు ఎంపీ వంశీకృష్ణ. వరద బాధితులకు అండగా ఉంటామన్నారు.
చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ పర్యటన
మరోవైపు మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను, అన్నారం బ్యారేజీని సందర్శించారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేసేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు ఎమ్మెల్యే. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. నాడు BRS చేసిన తప్పిదాల వల్లే వర్షాలకు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతులకు అండగా ఉంటాన్నారు ఎమ్మెల్యే వివేక్.