ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లా్ల్సిన బాధ్యత కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ పై ఉందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మందమర్రి మండలం అందుగుల పేట్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ సమావేశంలో పాల్గొన్నారు వంశీకృష్ణ. 

పార్టీ విధి,విధానాలు,ప్రభుత్వ పథకాలు,భవిష్యత్ కార్యాచరణపై సోషల్ మీడియా వారియర్స్ తో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని సోషల్ మీడియా వారియర్స్ ను కోరారు. 

గత అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకరావడంతో ఎంతో కృషి చేశారు. సెల్ ఫోన్ ఆయుధంగా ప్రజలకు మంచి విషయాలను విస్తృతంగా ప్రచారం చేశారని కొనియాడారు. 

ప్రపంచవ్యాప్తంగా సోషల్  మీడియా హవా కొనసాగుతోంది. ప్రజలు ఈ ప్రచార మాధ్యమాన్ని ఎక్కువగా విశ్వసిస్తున్నారు.. సోషల్ మీడియా వారియర్స్ కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.