మంచిర్యాల రైల్వే స్టేషన్లో మరిన్ని రైళ్లు ఆపాలి:ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల రైల్వే స్టేషన్లో మరిన్ని రైళ్లు ఆపాలి:ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ప్రయాణికుల సౌకర్యం కోసం పెద్దపల్లి నియోజకవర్గంలోని మంచిర్యాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లను ఆపాలని రైల్వే శాఖ అధికారులను కలిశారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 

మంగళవారం ( సెప్టెంబర్ 24) ఢిల్లీలో పెద్దపల్లి నియోజకవర్గంలోని  నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులను,అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. 

మంచిర్యాల రైల్వేస్టేషన్లో కేరళ ఎక్స్ ప్రెస్, బెల్లంపల్లిలో తిరుపతి వెళ్లేందుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలకు వెళ్లడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేరళ ఎక్స్ ప్రెస్కు మంచిర్యాలలో స్టాప్ ఇవ్వాలని కోరారు. 

మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో పారిశ్రామిక రంగంలో ముందున్నాయని సింగరేణి ప్రాంతం నుంచి రైల్వే ఆదాయానికి ఏటా 10వేల కోట్లకు పైగా వస్తుందన్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.పెద్దపల్లినియోజకవర్గంలోని NH63 పై జోగువాగు వద్ద రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ణతలు తెలిపారు. 

గతంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి NH63 రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రినితిన్ గడ్కరీని కోరామన్నారు. రోడ్డు విస్తరణకు కోసం రూ. కోటి 80 లక్షలు మంజూరు చేశారు చెప్పారు. మరో 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు.