బీజేపీ ఈడీతో వ్యాపార వేత్తలపై దౌర్జన్యం చేయిస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సెబీ అక్రమాలపై హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో పాల్గొన్న వంశీకృష్ణ. ఓ కార్పొరేటర్ కు లబ్ధి చేకూరేలా సెబీ ఛైర్మన్ మాధబి వ్యహరించడం దారుణమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లినా మరుసటి రోజే ప్రతిపక్షాలపై ఈడీతో దాడులు చేయిస్తుందన్నారు.
ఈడీని బీజేపీ రాజీకీయంగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు వంశీకృష్ణ. బీజేపీలో చేరితే దాడులు ఆపేస్తుందని..ఇలా బీజేపీ ఈడీని రాజకీయ లబ్ధి పొందేందుకు వాడుతోందని విమర్శించారు వంశీకృష్ణ. సెబీ ఛైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు వంశీకృష్ణ.
అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముం ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొన్నం, ఎంపీలు మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డంవంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, దానం, జయవీర్ రెడ్డి, ఆందోళనల్లో పాల్గొన్నారు.