రూ.140 కోట్ల సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ సాధించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ : 35 ఏళ్ల తర్వాత కల సాకారం

రూ.140 కోట్ల సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ సాధించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ : 35 ఏళ్ల తర్వాత కల సాకారం

గత 35 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న సింగరేణి కార్మికుల పెన్షన్ ఫండ్ కలను సాకారం చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ అంశంపై పార్లమెంటులో గళమెత్తి ఎంపీ వంశీకృష్ణ చేసిన పోరాటం ఫలించింది.సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతీ టన్నుపై రూ.20 పెన్షన్ ఫండ్‌కి కేటాయించేందుకు అంగీకరించింది. దీని ద్వారా రూ.140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్‌కి చేరునుంది. కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ.. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెరగలేదు. దీంతో రంగంలోకి దిగిన యువ ఎంపీ వంశీకృష్ణ ఎట్టకేలకు కార్మికులను సాకారం చేశారు.

కార్మికుల భవిష్యత్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థలకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన ఎంపీ వంశీకృష్ణ ప్రతి మెట్టులో పోరాటం చేస్తూ.. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ కేంద్ర మంత్రులను, సింగరేణి అధికారులను కలిసి వినపతి పత్రాలు సమర్పిస్తూ నిరంతరం కృషి చేశారు.

ఈ క్రమంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. ఇది ఆరంభం మాత్రమేనని..  నా లక్ష్యం – ప్రతి కార్మికుడికి నెలకు రూ.10 వేలు పెన్షన్ అందే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు వంశీకృష్ణ. ఈ ఉద్యమం ఇక ఒక్క వ్యక్తిది కాదని.. లక్షల మంది కార్మికుల ఆకాంక్ష అని అన్నారు  ఎంపీ వంశీకృష్ణ. 

సింగరేణి కార్మికుల పట్ల నిబద్ధతను ఈ విజయంతో మరోసారి నిరూపించుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కార్మిక సంఘాలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.