
ఆదిలాబాద్‌టౌన్/భైంసా, వెలుగు: పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని రాజ్యాంగాన్ని మారుస్తారని ప్రజలను తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రజలు తమకే పట్టం కట్టారని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి పాటుపడతానన్నారు. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్, పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్, జాతీయ రహదారుల విస్తరణ, ఇతరత్రా సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు రావుల రాంనాథ్, ఆదినాథ్, అశోక్ ముస్తపురే, విజయ్, మయూర్ చంద్ర, దినేశ్ మటోలియా, లాలా మున్నా తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆశీర్వాదంతోనే భారీ మెజార్టీ
ముథోల్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. భైంసాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల కంటే బీజపీ 15 వేల మెజార్టీ అధికంగా వచ్చిందన్నారు. గొడం నగేశ్ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు.