అది స్కూలా.. బారా.. నువ్వు టీచరా లేక వెయిటరా : పిల్లలతో మందు తాగించటం ఏంట్రా వెదవా..!

అది స్కూలా.. బారా.. నువ్వు టీచరా లేక వెయిటరా : పిల్లలతో మందు తాగించటం ఏంట్రా వెదవా..!

ఈ టీచర్ కు మైండ్ దొబ్బిందా లేక బుర్రలేనోడికి టీచర్ ఉద్యోగం ఇచ్చారో తెలియటం లేదు.. వీడు చేసిన పనికి మాలిన పనిని చూసి సోషల్ మీడియా పొట్టు పొట్టు తిడుతుంది.. అసలు వీడు టీచరా లేక బారులో వెయిటరా.. అది స్కూల్ అనుకుంటున్నాడా లేక బార్ అనుకుంటున్నాడా అంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు.. ఇంతకీ మేటర్ ఏంటంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్ని జిల్లా. బర్వార్ బ్లాక్ ఏరియాలోని ఖిర్హాని అనే గ్రామం. అది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. పదో తరగతి వరకు పిల్లలకు చదువు చెప్పే సర్కార్ బడి. ఆ స్కూల్ లో నవీన్ ప్రతాప్ సింగ్ అనే  50 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నాడు. మనోడికి బాగా మందు కొట్టే అలవాటు ఉన్నట్లుంది.. దీన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాడు.

స్కూల్ పిల్లలకు మందు పార్టీ ఇచ్చాడు. ఓ ఫుల్ బాటిల్ మందు కొనుక్కొచ్చి.. మందు ఎలా కలపాలి.. ఎంత మందులో ఎంత వాటర్ మిక్స్ చేయాలి అంటూ పిల్లలకు వివరిస్తూ.. కాఫీ కప్పుల్లో మందు పోస్తూ.. ఆ మందును పిల్లలకు తాగిస్తున్నాడు. చేసేది వెధవ పని అనే సోయి లేకుండా.. ఏకంగా వీడియో తీసి.. అదేదో ఘనకార్యంలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ గ్రేట్ గవర్నమెంట్ టీచర్ నవీన్ ప్రతాప్ సింగ్.
 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కట్నీ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. ఈ వీడియోపై విచారణ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారికి ఆర్డర్ వేశారు. ఆ విద్యాశాఖాధికారి విచారణ చేసి.. వీడియో అంతా నిజమే అని తేల్చారు. ఆ వెంటనే ఆ టీచర్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

పిల్లలకు మందు క్లాసులు పెట్టటం ఏంటో.. వాళ్లతో తాగించటం ఏంటో అనే విమర్శలు వస్తున్నాయి. ఆ పిల్లలు అందరూ 18 ఏళ్ల లోపు వారే అని.. వాళ్ల వయస్సు 14, 15 ఏళ్లు మాత్రమే ఉంటాయని.. 18 ఏళ్లు లోబడి వయస్సు ఉన్న పిల్లలకు మద్యం అమ్మటం, వాళ్లతో తాగించటం అనేది నేరం అనే విషయం కూడా ఆ టీచర్ కు తెలియపోవటం చూస్తుంటే.. అసలు వీడు ఇన్నాళ్లు పిల్లలకు చదువు చెప్పాడా లేక సన్నాసి పనులు నేర్పించాడా అనే డౌట్ వస్తుంది. 

ఈ టీచర్ కు కనీస ఇంగిత జ్ణానం కూడా లేకుండా పోయిందంటూ పేరంట్స్ సైతం తిట్టిపోస్తున్నారు. సస్పెండ్ కాదు.. ఉద్యోగం ఊస్టింగ్ చేయాలనే డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..