కాజీపేట, వెలుగు: కాజీపేట లోని ఫాతిమానగర్ ఆర్వోబీ పనులను మార్చికల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఆర్ అండ్ బీ అధికారులు, రైల్వే అధికారులతో కలిసి కాజీపేటలోని ఫాతిమానగర్ దగ్గర ఆర్వోబీ పనులను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా స్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.బ్రిడ్జి నిర్మాణం కోసం మెటీరియల్ తెప్పించడం జరిగిందని, పది రోజుల్లో పూర్తి మెటీరియల్ తెప్పిస్తామని తెలిపారు.