ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది :  ఏఐసీసీ సెక్రటరీ సంపత్

ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది :  ఏఐసీసీ సెక్రటరీ సంపత్

హసన్ పర్తి, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టపరంగా అమలయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏఐసీసీ సెక్రటరీ సంపత్, వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. సోమవారం ఎర్రగట్టు గుట్టలోని కేఎల్ ఎన్ కన్వెన్షన్ లో మాదిగ, ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం నమీండ్ల శ్రీనివాస్  అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య​అతిథులుగా ఏఐసీసీ సెక్రటరీ సంపత్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సత్యనారాయణ, కడియం శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ రాజ్యాంగం రద్దు చేస్తానని మాట్లాడే వారిని వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధితో ఉందని ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, రాజయ్య, శ్రీధర్, మాజీ ఎంపీ దయాకర్, ప్రొఫెసర్ కాశీ రామ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్  తదితరులున్నారు.