హనుమకొండ సిటీ/ స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: వరంగల్ పార్లమెంట్ పరిధిలోని హైవేలను అభివృద్ది చేయాలని కోరుతూ వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హైదరాబాద్ లో మంగళవారం నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీసర్ శివశంకర్ ను కలిసి కోరారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని నిడిగొండ, చాగల్, స్టేషన్ ఘన్ పూర్, చిన్న పెండ్యాల, కరుణాపురం సర్వీసు రోడ్డును పొడగించాలన్నారు.
చిన్న పెండ్యాల రోడ్డులో సెంట్రల్ లైటింగ్ లేనందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వరంగల్–ఖమ్మం హైవేని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలన్నారు. ఎన్ హెచ్–353 లో సీఆర్ నగర్ భూపాల్ పల్లి నుంచి ఘనపూర్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ఆయా మండలాలోని పుట్ ఓవర్ బ్రిడ్జి ,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని నేషనల్ హైవేస్ రీజినల్ ఆఫీసర్ హమీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. వారి వెంట వరంగల్ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఉన్నారు.