
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్షన్ కమిషన్(ఈసీ) ఒక విఫల సంస్థ అని, ఏమీ పనిచేయట్లేదని కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా తన విధులను నిర్వర్తించడం లేదని, దీంతో ప్రజలకు ఈసీపై నమ్మకం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ఈ సమస్యను ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కరిస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలతో పాటు ఎన్నికల ప్రక్రియలో పలు సమస్యలు ఉన్నాయని ఆరోపించారు.