కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని  అన్నారు ఎంపీ కవిత . జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలో  రోడ్ షో  నిర్వహించిన ఆమె..‘కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.అందుకే ఆయన బెస్ట్ సిఎం అని ఇటీవల సర్వేలో వెల్లడయింది. జగిత్యాల పట్టణ సమీపంలో నాలుగువేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కడుతున్నాం.  వచ్చే 5 ఏళ్లలో ఇళ్లకు స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇస్తాం. స్థలం ఉన్న వారికి  రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది.  ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ  పథకం ద్వారా ప్రతి చెరువును నీటితో నింపుతాం. ఇందు కోసం  ఎస్సారెస్పీ కెనాల్ ను ఫీడర్ ఛానళ్ల ద్వారా చెరువుకు  అనుసంధానించి , ఎప్పటికీ చెరువులో నీరు ఉండేలా చూస్తాం. ఎస్సీ,ఎస్టీ ఇంకా ఇతర కులాలకు ఆర్థికంగా చేయూత అందించాల్సిన అవసరం ఉంది. రూ.50 వేల నుంచి 20 లక్షల వరకు కుల వృత్తుల బలోపేతానికి లోన్లు ఇప్పిస్తాం.  మన జిల్లాకు చెందిన కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు.. వారి ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతాయి. నాకు అవకాశం ఇచ్చి పార్లమెంట్ కు పంపారు మీ తరఫున మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. జిల్లా, రాష్ట్ర, దేశ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాను..మళ్లీ గెలిపించి పార్లమెంటుకు పంపండి.‘ అని అన్నారు.