
స్టేషన్ఘణ్పూర్, వెలుగు: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి బోకే అందజేశారు. ఆమె తన తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటరాగా, సీఎంతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆమె వివరించారు. 2,20,339 మెజార్టీ సాధించినందుకు కావ్యను సీఎం అభినందించారు.