కడియంను కలిసిన బీఆర్ఎస్ ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి

ధర్మసాగర్​(వేలేరు), వెలుగు: స్టేషన్ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేలేరు మండల ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

బుధవారం హనుమకొండలోని కడియం శ్రీహరి నివాసంలో కలిసి బొకే అందజేసి, తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఎంపీపీతో పాటు మాజీ సర్పంచ్​ మళ్లికార్జున్ తదితరులు ఉన్నారు.