కేసీఆర్​ది మానవత్వం లేని ప్రభుత్వం

  • ఎంపీ కోమటిరెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు: సీఎం కేసీఆర్​ది మానవత్వం లేని ప్రభుత్వమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్​ అయ్యారు. పట్టణంలో కొద్ది రోజుల క్రితం ఏసీ కంప్రెషర్ పేలి మరణించిన కలీం, సాజిద్ కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనవంతుగా ఇప్పటికే రెండు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించానన్నారు. -కలీం, సాజిద్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చు అంతా తానే భర్తిస్తానన్నారు.

రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇల్లు  ఇచ్చి ఆదుకోవాలన్నారు.  -  ఈ విషయంపై సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తానన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ పేదవాడికి అండగా ఉంటామన్నారు. అనంతరం రివర్ నిమ్స్ ఆస్పత్రిని సందర్శించా రు.   పలువురిని  పరామర్శించి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.