ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సొంత పార్టీ నాయకుడితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఒకటి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కాంగ్రెస్ నేతను కోరారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ తానే అవుతానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ లో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు. పార్టీలను చూడొద్దని, రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలని కోరారు.
ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తుంటారని, ఉప ఎన్నికలో ఓటు ఆయనకే వేయాలని ఫోన్ కాల్ లో రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ లీడర్ తో వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.