మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైరయ్యారు. భట్టి విక్రమార్క తన స్వార్థం కోసమే పాదయాత్ర చేస్తున్నారని అంటున్నావ్ కదా... భట్టి లాగా పది రోజులు పాదయాత్ర చేసి చూపించాలని సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లాలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు కోమటిరెడ్డి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి జగదీష్ రెడ్డిపై అనేక కేసులున్నాయన్నారు. 2014లో సీఎం కేసీఆర్ ఇక్కడే కూర్చొని కూర్చి వేసుకొని నక్కలగండి ప్రొజెక్టు పూర్తిచేస్తా అన్నాడు.. ఇప్పుడు ఏమైందని ప్రశ్ని్ంచారు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.
రాబోయే ఎన్నికల కోసం 5 నెలలు కష్ట పడితే.. రానున్న 5 ఏళ్ళు మనవేనని కోమటిరెడ్డి కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే నుండి సీఎం వరకు అందరూ ఒకేలా ఉంటారు.. కలిసి పనిచేస్తారని చెప్పారు.